భారతదేశం, డిసెంబర్ 25 -- రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు కురుస్తోంది. ఉదయం సమయంలో బయటికి రావాలంటే కూడా జనాలు ఇబ్బందిపడుతున్నారు. సాయంత్రం 5 దాటితే చీకటి పడుతుండగా. చలి తీవ్రత మొదలవుతున్న పరిస్థితులున్నాయి.

ఈ వారమంతా చలి తీవ్రత ఉన్నప్పటికీ. ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ వెదర్ మ్యాన్ పోస్ట్ ప్రకారం.. 25 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా కనిపించిందని పేర్కొంది. ఈనెల 31వ తేదీతో తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత సాధారణ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇంతటితో చలి పూర్తి అయినట్లు కాదని.. జనవరి 4వ వారం వరకు కూడా చలి ఉంటుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న వెదర్ లో అయితే మార్పు ఉంటుందని పేర్కొంది....