Telangana,hyderabad, జూలై 11 -- తెలంగాణలో మరికొన్నిరోజులు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం..ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(జూలై 12) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ ...