Telangana,hyderabad, మే 30 -- రాష్ట్రంలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్తవాటివి మాత్రమే కాకుండా. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఈ గడువు మే 31వ తేదీతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల గడువును పొడిగించినట్లు నిర్ణయం తీసుకుంది.

గత విద్యా సంవత్సరానికి సంబంధించి 12 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలకు అర్హులు కాగా ఇప్పటివరకు. 10 లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మరికొంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం ఈ గడువును పొడిగించారు. కొన్ని ...