భారతదేశం, జనవరి 1 -- రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువుపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థుల కోసం.. మార్చి 31వ తేదీ వరకు తాజాగా గడువు పొడిగించారు.

రాష్ట్రంలో 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతేడాది జూలై నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించారు. కొత్తవాటివి మాత్రమే కాకుండా. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు.

చాలా మంది విద్యార్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకపోవటంతో.. గడువు పొడిగించారు. ప్రవేశ పరీక్షల డేటాను ఈపాస్‌ వెబ్‌సైట్లో నమోదు చేయకపోవడంతో పలువురు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ...