Hyderabad,telangana, జూన్ 25 -- టీజీ లాసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష.. జూన్‌ 6వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ లాసెట్‌ పరీక్షకు మొత్తం 57,715 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. వీరిలో 45,609 మంది హాజరయ్యారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు.

ఇటీవలే లాసెట్ ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయిన నేపథ్యంలో. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు.

టీజీ లాసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్...