Telangana,hyderabad, ఆగస్టు 14 -- రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ - 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే గడువు దగ్గరపడింది. అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో. అర్హులైన అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

టీజీ లాసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా ఆగస్టు 21, 22 తేదీల్లో విడత వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. ఆగస్టు 23వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 28వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు ఆగస్టు 29 కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇందుకు సెప్టెంబర్ 2వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సీట్లు పొందిన ...