Telangana,hyderabad, ఆగస్టు 6 -- రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.ఇందుకు ఆగస్ట్ 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఆగస్టు 4వ తేదీ నుంచి టీజీ లాసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకు ఆగస్టు 14 వరకు గడువు ఉంటుంది. ఆగస్టు 21, 22 తేదీల్లో మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. ఆగస్టు 23వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 28వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు ఆగస్టు 29 కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇందుకు సెప్టెంబర్ 2వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిప...