Telangana,hyderabad, జూన్ 12 -- తెలంగాణ లాసెట్ -2025 అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే పరీక్ష పూర్తి కాగా.. తాజాగా ప్రాథమిక కీలు వచ్చేశాయి. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఇందుకు జూన్ 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

తెలంగాణ లాసెట్ ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ గడువు జూన్ 13వ తేదీతో పూర్తవుతుంది. అభ్యంతరాల పరిశీలన తర్వాత. జూన్ 25వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల వెల్లడించిన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు. విడతల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

అభ్యర్థి సాధించిన ర్యాంకుతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి. సీటు ఖరారు చేసుకోవాల్సి ఉంట...