Telangana, మే 31 -- తెలంగాణ లాసెట్ - 2025కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఎంట్రెన్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మే 25వ తేదీ నాటికి ఆలస్య రుసుంతో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పరీక్ష జూన్ 6వ తేదీన జరగనుంది.

జూన్ 6వ తేదీన టీజీ లాసెట్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సు ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉటుంది. రాత పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ ను వెల్లడిస్తారు.

ఫలితాల వెల్లడించిన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు. విడతల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అభ్యర్థి సాధించిన ర్యాంకుతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో ర...