భారతదేశం, నవంబర్ 16 -- రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయన్నారు. పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ అంశంలో వెంటనే కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వెంటనే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలన్నారు కేటీఆర్. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో సీసీఐ కొనుగోలుకు నిరాకరిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులకు భారీ నష్టం కలుగుతుందన్నారు. కనీస మద్ద...