భారతదేశం, జూన్ 16 -- తెలంగాణ రైతాంగానికి అండగా నిలుస్తూ, ప్రజా ప్రభుత్వం తమ మాట నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'రైతు నేస్తం' వేదికగా ఆన్‌లైన్‌లో మీట నొక్కి, రైతు భరోసా నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రైతుల ఆశీర్వాదం ఎంత కీలకమో ఉద్ఘాటించారు. "రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం" అని ఆయన అన్నారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "గతంలో పదవులు అనుభవించినవాళ్లు, పదేళ్లు ...