భారతదేశం, మే 17 -- రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ సలహా మండలి ఏర్పాటైంది. ఈ మండలిలో సలహాదారుగా భాగస్వామ్యం కావడానికి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ అంగీకరించారు. అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వం చేపట్టిన చర్యలు వంటి అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ రంగాల నిపుణులతో తెలంగాణ రైజింగ్ సలహా మండలి ఏర్పాటు చేసింది. దీంట్లో పాలుపంచుకోవాలని ఈ భేటీ సందర్భంగా...