భారతదేశం, డిసెంబర్ 6 -- రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్లోబల్ సమ్మిట్ వేదిక 100 ఎకరాల్లో విస్తరించి ఉంది, భారీ టెంట్లు, డిజిటల్ స్క్రీన్లు, తెలంగాణ రైజింగ్ నినాదంతో ఆకర్షణీయమైన బిల్‌బోర్డ్‌లతో కనిపిస్తుంది.

ప్రధాన సమావేశ మందిరంలో ఒకేసారి 2,500 మంది కూర్చొవచ్చు. పక్కనే ఉన్న హాలులో ఇందిరా మహిళా శక్తి, హైడ్రా, ఇతర తెలంగాణ ప్రభుత్వ స్టాళ్లు ఉండే ఎగ్జిబిటర్ల కోసం ఒక స్థలం ఉంది. ఇంకా ప్రధాన హాలుకు ఎడమ, కుడి వైపున మూడు చొప్పున ఆరు మినీ హాళ్లు ఉంటాయి. సమ్మిట్ సమయంలో పెద్ద కంపెనీల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. ప్రధాన హాలు వెనుక భాగంలో ప్రతినిధులు, ముఖ్యమంత్రి కోసం భోజనం చేసేందుకు ప్రాంతం ఉంటుంది.

తెలం...