భారతదేశం, డిసెంబర్ 8 -- తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రారంభోత్సవానికి 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు.

విజన్ 2047 ప్రణాళిక, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ప్రభుత్వ మద్దతు, తెలంగాణ పాలన వ్యూహాలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక అంశాలను ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. అనేక మంది జాతీయ ప్రతినిధులు, ప్రముఖులు ఇప్పటికే వచ్చారు. సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని గవర్నర్‌ జి...