భారతదేశం, డిసెంబర్ 7 -- అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అత్యుత్తమ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి శనివారం పరిశీలించారు. సదస్సు నిర్వహిస్తున్న మీర్‌ఖాన్‌పేట్‌లోని ప్రాంతాన్ని హెలికాప్టర్ నుంచి వీక్షించారు.

ఆ తర్వాత వేదిక ప్రాంగణమంతా కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రతి అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా వహించాలని చెప్పారు.

సదస్సు ప...