భారతదేశం, డిసెంబర్ 9 -- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు కూడా పెట్టుబడులపై అవగాహన ఒప్పందాలు జరిగాయి. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు తెలంగాణకు రూ.1,11,395 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు వరుసగా సమావేశాలు, అవగాహన ఒప్పందాలపై సంతకాలతో బిజీ బిజీగా ఉన్నారు. తెలంగాణలో రూ.150 కోట్ల పెట్టుబడితో పాల వ్యాపారాన్ని (రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం) విస్తరించే ప్రతిపాదనపై గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి 40 ఎకరాల భూమి అవసరం, రెండేళ్లలో 300 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టిస్తారు.

తెలంగాణల...