భారతదేశం, నవంబర్ 5 -- నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. ఆర్మీలో చేరాలనుకునేవారికోసం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. ఈ ర్యాలీకి రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు హాజరుకావొచ్చు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, చెన్నై జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీనిని హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రక్రియ ఉంటుందని ఆర్మీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ ఈ ర్యాలీని సమన్వయం చేస్తుంది. ఈ ర్యాలీలో భాగంగా.... అగ్నివీర్ జనరల్ డ్యూటీ , టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ వంటి వివిధ కేటగిరీల కింద అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉన్న వా...