భారతదేశం, జనవరి 27 -- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 7నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికలలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జనవరి 28న ఎన్నికల నోటీసు జారీ అవుతుంది. నామినేషన్ల స్వీకరణతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు.

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవర...