భారతదేశం, జనవరి 11 -- త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సిద్ధమయ్యే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్‌ పేరిట ప్రకటన విడుదలైంది.

హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీలోని పార్టీ కార్యాలయంలో శనివారం అడహాక్‌ కమిటీ సభ్యులకు శిక్షణ నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. సాధ్యమైనన్నీ స్థానాల్లో జనసేన తరపున అభ్యర్థులను నిలపాలని జనసేన పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో కూడా జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేసింది.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నం...