భారతదేశం, జనవరి 28 -- రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీంతో ఆసక్తి గల అభ్యర్థులు.కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈనెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

మరోవైపు ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పోలీసులు భారీ బందోబస్తు మధ్య నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి. స్వీకరిస్తున్నారు.

ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్‌ వేయడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్ ఉంటే నామినే...