భారతదేశం, జూన్ 4 -- తెలంగాణ ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రం (IMH) లో కలకలం రేగింది. ఒకరు చనిపోగా, దాదాపు 70 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ ఘటన మంగళవారం జరిగింది. దీనిపై అధికారులు విచారణ మొదలుపెట్టారు.
మంగళవారం ఉదయం ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడని అధికారులు తెలిపారు. ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది వెంటనే సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. తర్వాత అతన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి (OGH) కి తీసుకెళ్లగా, అక్కడ చనిపోయినట్లు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఎంహెచ్‌ను సందర్శించి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
దాదాపు 70 మంది ఇతర రోగులు వాంతులు, విరేచనాలతో బాధపడినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరి రక్తపోటు తక్కువగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి సీరియస్ ఏమీ లేదని కలెక్టర్ చెప్పారు. మిగిలిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.