భారతదేశం, నవంబర్ 23 -- కొన్ని రోజులుగా అనేక వాట్సాప్ గ్రూపులను హ్యాకర్లు టార్గెట్ చేసుకుంటున్నారు. తెలిసిన వ్యక్తుల నుంచే ఫైల్స్ వచ్చినప్పటికీ వాటిని ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే మెుదటగా మీకు తెలిసిన వ్యక్తి వాట్సాప్‌‌ను హ్యాక్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. మీ ఎస్బీఐ, ఆధార్‌లాంటివి అప్డేట్ చేయాలంటూ..apk ఫైల్స్‌ పంపిస్తారు. దాదాపు చాలా మంది తెలిసిన వ్యక్తి నుంచి వచ్చిన ఫైల్ కదా అని ఓపెన్ చేస్తారు. తర్వాత మీరు చేయడానికి ఏం ఉండదు. అంతా హ్యాక్ అయిపోతుంది. హ్యాకర్ మీ వాట్సాప్‌తో ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటాడు.

తాజాగా తెలంగాణలోని మంత్రుల వాట్సాప్‌ మీడియా గ్రూపుల్ హ్యాక్ అయ్యాయి. ఏస్‌బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఫైల్స్ ఓపెన్ చేయవద్దని పోలీసులు చెబుతున్నారు.

గత రెండు రోజులు...