భారతదేశం, మే 12 -- తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన లేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీజీఐఐసీని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా.. వేల కోట్ల రుణం పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు.

'టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్‌ అందుబాటులో ఉంచారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని తాకట్టుపెట్టేందుకు కుట్ర చేస్తుంది. దీనికి సంబంధించిన నిర్ధుష్టమైన ఆధారాలున్నాయి. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు. తెలంగాణ భూములను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నష్టం జరిగితే.. భూముల భవితవ్యం ఏంటి. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయా...