Hyderabad, జూలై 9 -- తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆ కోవలోకే ఇప్పుడు జీ5 ఓటీటీలోకి రాబోతున్న మోతెవరి లవ్ స్టోరీ చేరింది. ఈ సరికొత్త కామెడీ వెబ్ సిరీస్ పోస్టర్ ను మేకర్స్ బుధవారం (జులై 9) లాంచ్ చేశారు. మరి ఈ సిరీస్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

జీ5 ఓటీటీలో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ రాబోతోంది. దీనిపేరు 'మోతెవరి లవ్ స్టోరీ'. ప్రేమ, కామెడీ వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్‌ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఆగస్ట్ 8 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

విలేజ్ షో మూవ...