Telangana, ఏప్రిల్ 24 -- బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఇందుకు మే 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష లేకుండా.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండనుంది. మెరిట్ తో పాటు రిజర్వేషన్లను ప్రమాణికంగా తీసుకుంటారు. వీటి ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ ఈసీతో పాటు వొకేషనల్ కోర్సుల్లో కూడా సీట్లను చేపడుతారు.

అర్హులైన విద్యార్థులు h...