భారతదేశం, మే 13 -- ఏపీలో 15శాతం నాన్‌ లోకల్‌ కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ప్రొఫెషనల్‌ కోర్సులు, డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ప్రస్తుతం అమలవుతున్న 15% నాన్ లోకల్, జనరల్ కోటా సీట్లను ఇకపై పూర్తిగా ఏపీ వారికే కేటాయిస్తారు.

2025-26 విద్యా సంవత్సరంలో నాన్‌ లోకల్‌ కోటా 15% సీట్లు ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగిన విద్యార్థులకే దక్కుతాయి. నాన్‌ లోకల్ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి కూడా అవకాశం ఉండేది. ప్రభుత్వ ఉత్తర్వులతో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల వారికి ఈ అవకాశం ఉండదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్యలో ప్రొఫెషనల్‌ కోర్సుల్లో అడ్మిషన్లు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక, స్థానికేతర నిర్వచనాలను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యా...