భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆధార్ లేనిదే నిత్యం ఏ పని సాగదు, ప్రతి పనికి అవసరమయ్యే ఆధార్ కార్డు పొందడం అంత సులభతరం అవడం లేదు, ప్రభుత్వం నుంచి పొందే ఏ పథకానికైనా, చదువులకైనా, అంగన్వాడి పాఠశాలలో చేర్పించాలన్న ఆధార్ తప్పనిసరి. ఆధార్ 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఆధార్ నమోదు గత మూడు నెలలుగా తెలంగాణలో రిజెక్టు అవ్వడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు, ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే రేషన్ కార్డులను జారీ చేస్తోంది, ఈ సమయంలో తమ పిల్లలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా జత చెయ్యాల్సి ఉండగా పిల్లల ఆధార్ కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకొనే సమయంలో పిల్లల బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా జతపరుచాలి. ఆధార్ నిర్వాకులు తెలంగాణ ప్రభుత్వం మీసేవ ద్వారా ఇచ్చే బర్త్ సర...