Hyderabad,telangana, జూన్ 28 -- తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించిన మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి. ప్రభాకర్ రావుని కూడా ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కేసులోని మూలాలను వెలికి తీయాలని భావిస్తోంది.అయితే సిట్ విచారణలో ఆయన సరైన సమాధానాలు చెప్పటం లేదన్న వార్తలు కూడా బయటికి వస్తున్నాయి.

ఓవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను విచారిస్తూనే.. మరోవైపు బాధితుల వివరాలను కూడా సిట్ సేకరిస్తోంది. ఇందులో సినీ, రాజకీయ, మీడియా, వ్యాపారవేతలతో పాటు పలువురు ప్రముఖలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలకు సిట్ నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి స్టే...