భారతదేశం, జనవరి 12 -- జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డుల గురించి ఎక్కడో వినేవాళ్లం ఇప్పుడు భారత్‌లో, అందులో ఏపీలోనూ నమోదు అవుతున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

గోదావరి పుష్కరాల కంటే ముందే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నల్లమల సాగర్ ద్వారా రాయలసీమకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉందని, అంతేకాకుండా మిగులు జలాలను తెలంగాణకు కూడా సరఫరా చేసే అవకాశం ఉందని అన్నారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడూ వ్యతిరేకించలేదని, 3000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నందున పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నేనెప్పుడూ అడ్డు...