Telamgana, జూన్ 26 -- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇటీవలనే డీఏ పెంపుపై ప్రకటన చేసిన ప్రభుత్వం.. తాజాగా పెండింగ్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వివరాలను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్‌లో ఉన్న రూ.180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిర్ణయంతో 26,519కి ఊరట దక్కనుందని వెల్లడించారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. " లెక్కకు మించిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు ప్రాధాన్యత...