భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా దృష్ట్యా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయాలని, విస్తరించాలని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు (DMHOలు), ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

పిల్లల సంరక్షణ ద్వారా పిల్లలకు లభించే శ్రద్ధ ఇప్పుడు వృద్ధులపై కూడా అవసరమని మంత్రి దామోదర్ రాజనరసింహా అన్నారు. ఆయుర్ధాయం పెరగడంతో, వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 'జపాన్, ఇటలీ వంటి దేశాలు వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో భారతదేశానికి కూడా ఇటువంటి వ్యవస్థలు ...