భారతదేశం, డిసెంబర్ 20 -- మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు మృతి చెందగా. భారీస్థాయిలో లొంగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో పలువురు రాష్ట్రస్థాయి నేతలు ఉన్నారు. 24 ఆయుధాలను అందజేశారు.

లొంగిపోయిన వారిలో ప్లాటూన్‌ కమిటీ మెంబర్లు, డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు.

లొంగిపోయినవారిలో కొమురంభీం ఆసిఫాబాద్‌- మంచిర్యాల డివిజనల్‌ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్‌ సంతోష్‌(40), అర్బన్‌ ఏరియా పార్టీ సభ్యుడు కనికారపు ప్రభంజన్‌(33) ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన వారు వీరిద్దరే ఉన్నారని చెప్పారు. రవి కామారెడ్డి జిల్లా ఆరెపల్లి వ...