భారతదేశం, మే 19 -- తెలంగాణలో బీడు వారుతున్న పోడు భూముకు జల కళను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతోంది. గిరిజన ప్రాంతాల్లోని దాదాపు రెండు లక్షల ఎకరాల పోడు భూములను వ్యవసాయానికి అనువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరి సౌర గిరి జల వికాసం పథకంతో సోలార్ పంప్‌ సెట్లను రైతులకు అందిస్తారు.

పోడు భూముల్లో సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. పోడు వ్యవసాయంలో మెరుగైన ఉత్పాదకత సాధించేలా ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తారు.

ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు నీటి లభ్యత అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఐదేళ్లలో 2.10లక్షల ఎకరాల పోడు భూములకు సోలార్ పంప్‌ సెట్లను అందిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా గిరిజన రైతులు ...