భారతదేశం, జూలై 22 -- తెలంగాణ పాలిసెట్ 2025 చివరిదశ కౌన్సెలింగ్ జూలై 23వ తేదీన మెుదలుకానుంది. TG POLYCET 2025 అర్హత సాధించిన అభ్యర్థులు జూలై 23న https://tgpolycet.nic.in/ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూలై 24న జరగనుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత అభ్యర్థులు జూలై 24, 25 తేదీల్లో సీటు, కళాశాల కేటాయింపు కోసం వెబ్ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు. జూలై 28న లేదా అంతకు ముందు తాత్కాలిక సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీట్ల కేటాయింపును నిర్ధారించుకోవాలి. జూలై 28 లేదా 29న ఫీజు చెల్లించాలి.

అభ్యర్థులు జూలై 28, 30 మధ్య కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలి....