భారతదేశం, ఏప్రిల్ 30 -- తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2025 విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో టెన్త్ రిజెల్ట్స్ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 91.32 % శాతం, బాలికలు 94.26 % శాతం ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3, 2025 నుంచి జూన్ 13 వరకు ఉదయం గం. 09.30 నుంచి మధ్నాహ్నం గుం.12.30 వరకు నిర్వహించనున్నారు.

పరీక్షలను అతి తక్కువ వ్యవధిలో నిర్వహించనున్న కారణంగా విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా జూన్-2025 సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.

1. విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లింపు చివరి ...