భారతదేశం, ఏప్రిల్ 30 -- తెలంగాణ పదోతరగతి ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

పదో తరగతి ఫలితాలను విద్యార్థులు హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో https://telugu.hindustantimes.com/telangana-board-10th-result ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.

పదో తరగతి ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ పదో తరగతి పరీక్షలు 21.03.2025 నుంచి 03.04.2025 వరకు నిర్వహించారు. స్పాట్ వ్యాల్యూయేషన్ ఏప్రిల్ 7 నుంచి నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించారు. ఎస్ఎస్సీ మార్చి 2025 పరీక్షలకు 5,09,564 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

ఎస్ఎస్సీ మార్చి -2025 పరీక్షలకు మొత్తం 5,07,107 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 4,96,374 మంది విద్యార్థులు రెగ్యులర్ గా,...