భారతదేశం, డిసెంబర్ 4 -- పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల మీద తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంపై ఆరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.

ఎస్సీ, ఎస్టీ జనాభా లేని ప్రాంతాల్లో సైతం ఆయా కులాలకు సర్పంచ్, వార్డు మెంబర్లుగా రిజర్వేషన్లు కేటాయించారని పిటిషన్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు తప్పుగా కేటాయించడం కారణంగా తప్పులు జరిగాయని వెల్లడించారు. అయితే రిజర్వేషన్లు కేటాయించిన ప్రదేశాల్లో సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే.. ఎన్నికలు నిర్వహించమని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ వాద...