భారతదేశం, మే 5 -- తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నర్సింగ్‌ ఆఫీసర్‌(స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గతేడాది నవంబర్ 23న 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్ సైట్ https://mhsrb.telangana.gov.in/ లో అందుబాటులో ఉంచారు.

ఈ పోస్టులకు మొత్తం 42,244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 40,423 మంది అభ్యర్థులు ఎగ్జామ్ కు హాజరయ్యారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టులను త్వరలో విడుదల చేయనున్నారు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://mhsrb.telangana.gov.in/ ను సందర్శించవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....