భారతదేశం, జూలై 8 -- తెలంగాణలోని దోస్త్ కౌన్సెలింగ్ ముగిసింది. 64 డిగ్రీ కళాశాలలు సున్నా ప్రవేశాలను నమోదు చేశాయి. 4.36 లక్షల సీట్లలో దాదాపు 2.94 లక్షలు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 3 లక్షలకు దగ్గరలో సీట్లు ఖాళీ అన్నమాట. జూలై 5న కళాశాలల కన్ఫర్మేషన్‌ ఎంపికతో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025 వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ ముగిసింది.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి పంచుకున్న దోస్త్ 2025 అడ్మిషన్ల గణాంకాలను పరిశీలించినప్పుడు దారుణంగా ఉన్నాయి. 64 డిగ్రీ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి ఒక్క విద్యార్థిని కూడా అడ్మిషన్ పొందడంలో ఆకర్శించలేదు. ఈ కళాశాలల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం 20,260 సీట్లు ఉన్నాయి.

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో అత్యధికంగా 22 కళాశాలలు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 14 కళాశాలలు ఉన్నాయి. ఉస్మానియా వి...