Telangana,hyderabad, ఏప్రిల్ 16 -- తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే అధికారులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను చేపట్టారు. ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేశారు. బుధవారం నుంచి కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇదంతా పూర్తి కావటానికి వారం నుంచి పది రోజుల వరకు సమయం పట్టొచ్చు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.

ఈ ఏడాదికి సంబంధించిన పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధాన...