భారతదేశం, ఏప్రిల్ 17 -- తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్ టెట్ (జూన్ సెషన్)నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

టెట్ కోసం ఏప్రిల్‌ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్‌ 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచుతారు. జులై 22న టెట్‌ రిజల్ట్స్ ప్రకటిస్తారు.

ఇక తెలంగాణ 'టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ...