Telangana, మే 1 -- తెలంగాణ టెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయింది. షెడ్యూల్ ప్రకారం. ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి కాగా.. ఎలాంటి గడువు పొడిగించలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ అప్డేట్ ఇచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ను తీసుకువచ్చింది. దీని ఆధారంగా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని పేర్కొంది.

తెలంగాణ టెట్ 2025 కు మొత్తం 1 లక్షా 65 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. గతేడాదితో పోల్చితే ఈసారి అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. గతేడాది రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహించారు. చివరిసారిగా జరిగిన టెట్‌-2024 చివరి విడత పరీక్షకు 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 2,05,278 మంది పరీక్ష రాశారు.

తెలంగాణ టెట్ 2025 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ...