Telangana, జూన్ 3 -- ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 9వ తేదీన విడుదల చేయనుంది. మరోవైపు ఈ నెల 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తాయి.
ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీటిలో పేపర్-1కు 63,261 , పేపర్-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి. వీరంతా కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షల షెడ్యూల్ వివరాలను విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
ఇక తెలంగాణ టెట్ పరీక్షల హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.