భారతదేశం, డిసెంబర్ 16 -- తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ పరీక్షలను జనవరి 3వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతాయని అధికారులు ప్రకటించారు. రెండు సెషన్లలో టెట్ పరీక్షలు ఉంటాయి. మెుదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బొధించేవారికి పేపర్ 1 పరీక్ష, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బొధించేవారికి పేపర్ 2 ఉంటుంది.

Published by H...