Telangana,hyderabad, జూలై 5 -- తెలంగాణ టెట్ (జూన్ సెషన్ ) -2025 పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలనే పరీక్షలు ముగియగా. తాజాగా ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిపై జూలై 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా.. 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరయ్యారు. పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికి దరఖాస్తు చేసుకోగా.. 41,207 మంది(76.73 శాతం) మంది హాజరయ్యారు.

తెలంగాణ టెట్ ప్రాథమిక కీలపై అభ్యంతరాలు ఉంటే విద్యా...