భారతదేశం, మే 2 -- తెలంగాణ టెట్‌ 2025కు చివరి రోజు దరఖాస్తులు పోటెత్తాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు టెట్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా చివరి రోజు చివరి గంటల్లో వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తం 1.83 లక్షల మంది దరఖాస్తు చేశారు.

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 30 అర్ధరాత్రి 12 గంటలతో గడువు ముగిసింది. ఈ ఏడాది దరఖాస్తులు 1.50 లక్షలు దాటకపోవచ్చని విద్యాశాఖ అంచనా వేసింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు టెట్ నిర్వహించడంతో కొత్తగా బిఇడి, డిఇడి పూర్తి చేసిన వారు లేకపోవడంతో దరఖాస్తులు తగ్గుతాయని భావించారు.

దరఖాస్తు గడువును కూడా పొడిగించక పోవడంతో లక్షన్నర లోపు దరఖాస్తులు వస్తాయని భావించారు. అనూహ్యంగా చివరి రోజు ఏకంగా 50 వేల మంది ద...