భారతదేశం, డిసెంబర్ 9 -- తెలంగాణను దేశ ఆర్థిక పవర్‌హౌస్‌గా మార్చే వ్యూహాత్మక లక్ష్యం దిశగా హైదరాబాద్‌లో ప్రారంభమైన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' తొలి రోజే (సోమవారం) సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వ విజన్ 2047కు బలమైన సాక్ష్యంగా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకున్న కీలక రంగాలలో Rs.1.88 లక్షల కోట్ల విలువైన 35కు పైగా భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు అంకురార్పణ జరిగింది.

డీప్ టెక్, కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాలు), ఫ్యూచర్ సిటీ వంటి రంగాలలో సుమారు Rs.1,04,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఖరారయ్యాయి. ఈ మొత్తంలో అత్యంత కీలకమైన భాగం బ్రూక్‌ఫీల్డ్ / ఆక్సిస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం నుంచి వచ్చింది.

Rs.75,000 కోట్ల భారీ నిధి: గ్లోబల్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (R&D), డీప్ టెక్నాలజీ, హై-వాల్యూ సేవల కోసం ఉద్దేశించిన 'భారత్ ...