భారతదేశం, నవంబర్ 9 -- తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ ) ప్రకటించగా. తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. నవంబర్ 10వ తేదీ నుంచి ఈనెల 26 వరకు పరిశిలీన ఉంటుందని పేర్కొంది.

ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో(గతంలో పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ) ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం వివరాలను వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నెంబర్లను పేర్కొన్నారు.

టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం. అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్...