భారతదేశం, అక్టోబర్ 7 -- తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. గ్రూప్‌ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని పేర్కొంది.

తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడంపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద డివిజెన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం మీద అభ్యర్థుల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

వాదనలు విన్న అత్యున్నత న్...