భారతదేశం, మే 22 -- తెలంగాణ గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుడంటంతో మిగిలిన ఉద్యోగ నియామకాలను కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రూప్-1 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ నిలిపివేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం, పిటిషనర్లకు న్యాయస్థానం జరిమానా విధించడంతో గ్రూప్‌1 సర్టిఫికెట్‌వ వెరిఫికేషన్ తుది తీర్పుకు లోబడి నిర్వహించారు.

గ్రూప్‌1 వ్యవహారంపై కమిషన్‌ వాదనలతో కోర్టులో న్యాయ వివాదం కొలిక్కి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీ మిగిలిన ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయాలని కమిషన్‌ భావిస్తోంది.

తెలంగాణలో 2,171 గ్రూప్-2, 3 పోస్టుల భర్తీకి కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది,. రాత పరీక్షల్లో జనరల్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా అభ్యర్ధుల ద్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియను టీజీపీఎస్సీ ఇప్పటికే పూర్తి చేసింది....